కొబ్బరితో అధిక బరువును వదిలించుకోండి

0
108

వాషింగ్టన్‌: బరువు తగ్గాలంటే కొబ్బరి తినాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కొబ్బరిలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. తింటే ఇంకా లావైపోతామనే సందేహం వద్దు. ఎందుకంటే ఇందులోని కొవ్వు పదార్థాలు నిజానికి కొవ్వు కాదట! వాటిని మీడియం చెయిన్‌ ట్రైగ్లిజరాయిడ్‌(ఎంసీటీ) అంటారని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఒబెసిటీ పేర్కొంది. గ్లూకోజ్‌ స్థాయులను ఏమాత్రం పెంచకుండానే శరీరానికి కావాల్సిన శక్తిని ఇవి అందజేస్తాయని వివరించింది. శరీరంలోకి చేరే ఇతర కొవ్వు పదార్థాలను ఈ ఎంసీటీలు ఖర్చు చేస్తాయని పేర్కొంది. ఇక ప్రతీ 100 గ్రాముల కొబ్బరిలో 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయని తెలిపింది. ప్రతీ వందగ్రాముల కొబ్బరిలో 354 కాలరీలు ఉంటాయట. దీంతో మీరు తీసుకునే ఆహారం పరిమాణం తగ్గిపోతుందని ఈ కథనం పేర్కొంది. డైటీషియన్లు కూడా రోజువారీగా స్వీకరించే కాలరీలలో 10 శాతం కొబ్బరి ఉండాలని సూచిస్తుంటారని వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here