ఎటువంటి స్నాక్స్ తినాలంటే.. సూపర్‌ సీడ్స్‌

0
118

తరచూ స్నాక్స్‌ తింటూ ఉంటే బరువు పెరిగిపోతామని మనందరికీ తెలుసు. అయినా నోటిని అదుపు చేసుకోలేం. అలాంటప్పుడు ఆరోగ్యం మీద, శరీర బరువు మీద ప్రభావం చూపించని స్నాక్స్‌ను ఎంచుకోవాలి. ఇలాంటివాటిలో ‘సీడ్స్‌’

బెస్ట్‌ ఆప్షన్‌.
గోధుమలు: గోధుమల్లో విటమిన్‌ ఇ, ఫోలేట్‌ (ఫోలిక్‌ యాసిడ్‌), ఫాస్ఫరస్‌, థయామిన్‌, జింక్‌, మెగ్నీషియం, ఇతర ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటిలోని అధిక పీచు మలబద్ధకాన్ని కూడా నివారించ టంతోపాటు పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. పైగా తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కలిగి ఉండటంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

పొద్దుతిరుగుడు: ఇవి రుచిగా ఉండటమే కాదు, వీటిలో బి విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్‌ ఇతో పాటు, కణ నష్టాన్ని నియంత్రించే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ కూడా ఉంటాయి. ఇవి కేన్సర్‌ బారిన పడకుండా కాపాడతాయి. వీటివల్ల ఆరోగ్యకరమైన చర్మం, వెంట్రుకలు సొంతమవుతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలోని ప్రొటీన్‌, కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here