జాగ్రత్త సుమా!

0
118

వేసవి పూర్తిగా ప్రవేశించకముందే ఎండలు ముదురుతున్నాయి. తీవ్రమైన ఎండ హృద్రోగుల పాలిట సమస్యాత్మకంగా పరిణమిస్తుంది. అందుకే వేసవి రాకతో అప్రమత్తంగా ఉండాలి.

ఆరోగ్యవంతులు సైతం ఎండదెబ్బకు తాళలేరు. మిగతా వాళ్లతో పోలిస్తే గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, వేసవిలో ఎదుర్కొనే సమస్యలు రెండు రె ట్లు అధికంగా ఉంటాయి. వీళ్లల్లో ఎవరైనా ఎండను పట్టించుకోకుండా, శారీరకంగా విపరీతంగా శ్రమిస్తే పరిస్థితి చేజారే ప్రమాదం ఉంది. ఏ జబ్బు కారణంగానైనా గుండె బలహీనపడినప్పుడు, శరీరం చల్లబడటానికి గానీ, రక్తపోటును నియంత్రించడానికి గానీ, అవసరమైన స్థాయిలో రక్తప్రసరణ జరగకపోవచ్చు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగి ఒక్కోసారి ప్రాణాపాయానికి దారి తీయవచ్చు.

తాగే నీటికి పరిమితి ఉంటే..
గుండె సంబంధిత సమస్యలున్న వారు శరీరంలో అదనపు నీరు నిలువై ఉండకుండా, ప్రతిరోజూ డ్యూరెటిక్‌ మాత్రలు వాడుతుంటారు. వీరు తాగే నీటి విషయంలో కూడా డాక్టర్లు ఒక పరిమితి విధిస్తారు. తదనుగుణంగా మందుల్ని, వాటి మోతాదును సూచిస్తారు. ఎందుకంటే నీటి పరిమాణం తగ్గితే, శరీరం బరువు కూడా తగ్గుతుంది. శరీరం బరువు తక్కువ వ్యవధిలోనే నాలుగైదు కిలోలు తగ్గితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

వడగాడ్పుల ప్రభావం..
హృద్రోగుల గుండె లో వాతావరణ తీవ్రతను తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే రోజుల్లో వీరు సతమతమవుతారు. అధిక వేడిమి వల్ల గుండె వేగం పెరుగుతుంది. శరీరంలోని నీటి శాతం పడిపోతుంది. ఇంటిపట్టునే ఉన్నా.. ఈ సమస్య ఎదురవుతుంది. హృద్రోగుల్లో గుండె కండరాలు బలహీనంగా ఉంటాయి. దీంతోపాటు చర్మంలోని రక్తసిరలు కూడా సంకోచించి ఉండటం వల్ల శరీరంలోని వేడి బయటకు వెళ్లడం కష్టమవుతుంది. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని ఎండ వేడిమి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మండుటెండలో బయటకు వెళ్లడం మానుకోవాలి.

అధిక రక్తపోటుతో అప్రమత్తం
గుండె జబ్బులు ఉన్నవారిలో శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు తొందరగా పెరిగిపోతాయి. చెమట ద్వారా నీరు అధికంగా బయటకు వెళ్లిపోవడం వల్ల శరీరంలో నీటి నిల్వలు పడిపోతాయి. ఈ ప్రభావం శరీరంపై పలురకాలుగా పడుతుంది. కొందరిలో ఇది రక్తపోటు పడిపోవడానికి, రక్తహినతకు కారణం అవుతుంది.

ఇలా చేయండి..
గుండె జబ్బులు ఉన్నవారు, రక్తపోటు నియంత్రణలో లేనివారు, అప్పటికే బైపాస్‌ సర్జరీ చేయించుకున్న వారు, స్టెంట్లు వేయించుకున్నవారు, వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
తమ వ్యాయామాలను ఎప్పటి లాగే కొనసాగించవచ్చు. కాకపోతే ఇంటి ఆవరణలోనే చేయడం మేలు. అయితే అక్కడున్న వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి.
ఇంట్లో ఎప్పుడూ ఒక హ్యాండీ ఫ్యాన్‌ దగ్గరలో ఉంచుకోవడం శ్రేయస్కరం.
శరీరాన్ని ఎప్పటికప్పుడు చల్లబరుచుకునేందుకు కొన్ని కూలింగ్‌ బ్రేక్స్‌ ఉండేలా చూసుకోవాలి.

ఆహారం ఎలా ఉండాలి?
హృద్రోగులు పొటాషియం, మెగ్నీషియం కోసం పండ్లు, తాజా కూరగాయాలకు అధిక ప్రాధాన్యమివ్వాలి. పళ్లు, కాయగూరలు అతిగా తీసుకోరాదు. ఎక్కువగా తీసుకుంటే పొట్ట ఒత్తిడికి గురవుతుంది. అందుకే రోజులో నాలుగైదుసార్లు పరిమితంగా తీసుకోవాలి.
చల్లటి సూప్స్‌, సలాడ్స్‌, పండ్లు ఆకలి తీర్చడంతో పాటు, శరీరంలో నీటి నిల్వలను పెంచుతాయి.

వ్యాయామం…
వేసవిలో వాకింగ్‌, గార్డెనింగ్‌ వంటివి పొద్దుపొద్దున్నే లేదా లేదా సాయంత్రం వేళల్లో చేయాలి. అదైనా పరిమితంగానే చేయాలి. మౌలికంగా, వ్యాయామాల తీవ్రతను, వ్యవధినీ తగ్గించాలి.
బయటి పనుల విషయంలో నిదానంగా నడవాలి.
మొత్తంగా చూస్తే, శరీరం విపరీతంగా అలసిపోయే వ్యాయామాల కన్నా, యోగా, ధ్యానాలకు ప్రాధాన్యమివ్వాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here