సిల్లీ రీజన్‌తో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు..!

0
92

డెహ్రాడూన్: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు రావడం సహజం. కానీ కొందరు దంపతులు మాత్రం అకారణంగా గొడపపడుతుంటారు. ఆ గొడవలు కాస్తా ఘర్షణకు దారితీస్తాయి. అలాంటి ఘటనే ఇది. భార్య ఉదయాన్నే బెడ్ టీ ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచి చంపేశాడో ప్రబుద్ధుడు. డెహ్రాడూన్‌లోని పౌరి జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కషిరామ్‌పూర్ గ్రామానికి చెందిన సంగీత్ సింగ్ నేగీకి ఉదయాన్నే టీ తాగే అలవాటుంది. భార్య టీ ఇస్తే కానీ సంగీత్ సింగ్‌కు పొద్దు గడిచేది కాదు. రోజులాగానే సంగీత్ సింగ్ తన భార్య ఆర్తిని బెడ్ టీ కావాలని అడిగాడు. కారణమేంటో తెలియదు కానీ టీ ఇచ్చేందుకు ఆర్తి నిరాకరించింది. దీంతో ఈ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. రోజు టీ ఇచ్చేదానివి… ఇవాళెందుకు ఇవ్వడం లేదని సంగీత్ సింగ్ భార్యతో వాదనకు దిగాడు.

ఈ వ్యవహారం కాస్తా ఆర్తి హత్యకు దారి తీసింది. పట్టరాని కోపంతో భార్యను పక్కనే ఉన్న కత్తెర తీసుకుని పొడిచాడు. దీంతో తీవ్రగాయాల పాలైన ఆమె బిగ్గరగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే ఆమె చనిపోయింది. పోలీసులు 302 సెక్షన్ కింద సంగీత్ సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికులు ఈ దంపతుల గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. సంగీత్‌, ఆర్తికి పెళ్లయి పదమూడేళ్లయిందని, ఇద్దరు పిల్లలున్నారని తెలిపారు. ఇద్దరూ తరచుగా గొడవపడేవారని, పలు సందర్భాల్లో సంగీత్ భార్యను కొట్టేవాడని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే హత్య చేసి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here