కోపంతో భార్యపై వెరైటీ ప్రతీకారం..!!

0
109

మాస్కో: కోపంతో ఓ భర్త తన భార్యపై వెరైటీగా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆమె కారు నిండా సిమెంటు కాంక్రీటును నింపి తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. రష్యాలో ఓ సూపర్‌ మార్కెట్‌ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది. దాదాపు 20లక్షలమందికిపైగా చూసిన ఈ వీడియో మరింత దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియో ప్రకారం ఓవర్నీ(నమ్మకం) అనే స్థానిక చిన్న సూపర్‌ మార్కెట్‌ తన ప్రచారంలో భాగంగా ఎవరు సర్‌ నేమ్‌గా తన పేరును పెట్టుకుంటే వారికి దాదాపు రూ.57వేల ప్రైజ్‌ మనీ ఇస్తుంది.

దీనిని అందుకునేందుకు ఓ వ్యక్తి భార్య ఏకంగా తన భర్త తరుపున వచ్చిన ఇంటిపేరును తొలగించుకొని ఆ స్టోర్‌ పేరును తన ఇంటిపేరుగా పెట్టుకుందంట. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆ భర్త తన భార్య కారును అదే స్టోర్‌ ముందుకు తీసుకొచ్చి ఓ సిమెంట్‌ కాంక్రీటు మిక్సింగ్‌ లారీని పిలిపించి ఆ కారులోని అద్దం గుండా మొత్తం కాంక్రీటును నింపేశాడు. ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించగా తన భార్య చేష్టలపై కోపంతో అని నవ్వుతూ బదులిచ్చాడు. అయితే, ఇదంతా కూడా సూపర్‌ మార్కెట్‌ ప్రమోషన్‌లో భాగంగానే ఈ వీడియో కావాలని రూపొందించి ఆన్‌లైన్‌లో పెట్టినట్లు పలువురు విమర్శిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here