కేంద్రంలో పాలన బాగుంది: ప్రధాని భార్య జశోదాబెన్‌..!!

0
96

వికారాబాద్‌: కేంద్రంలో పాలన బాగుందని, భవిష్యత్తులో ఇంకా బాగుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సతీమణి జశోదాబెన్‌ మోదీ అన్నారు. గురువారం అర్ధరాత్రి తరువాత వికారాబాద్‌ జిల్లాకు వచ్చిన ఆమె జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం నాగదేవత దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రతిష్ఠించిన నాగబుద్ధ అంబేద్కర్‌ విగ్రహానికి ఆమె పూలమాల వేసి ఆవిష్కరించారు. గోశాలకు వెళ్లి ఆవుకు పూజ చేసి గడ్డి తినిపించారు. దేశ ప్రధాని సతీమణి అయినప్పటికీ ఆమె ఎలాంటి భద్రత లేకుండా ఓ సాధారణ మహిళగా గడిపారు.

నాగ బుద్ధ అంబేద్కర్‌ విగ్రహాన్ని అంబేద్కర్‌ జయంతి రోజు ప్రారంభించేందుకు వికారాబాద్‌కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేవతలతో పాటు మహనీయుల విగ్రహాలు కూడా ప్రతిష్టించి పూజలు చేయడం అభినందనీయమని ఆమె అన్నారు. దేశంలో మోదీ పాలన ఎలా కొనసాగుతోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, పాలన బాగుందని, భవిష్యత్తులో ఇంకా బాగుంటుందని, బాగుండాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం దేవాలయం ఆవరణలో కొనసాగుతున్న నిత్యాన్నదానం కార్యక్రమానికి హాజరైన జశోదాబెన్‌ పలువురికి భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆమె సోదరుడి దంపతులు, నాగదేవత దేవాలయం నిర్వాహకుడు బరాడి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here