ఫోకస్‌ తప్పిన ఇన్ఫోసిస్‌

0
97

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌ కో చైర్మన్‌గా రవి వెంకటేషన్‌ నియామకంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నియామకం ఇన్ఫోసిస్‌ మేనేజ్‌మెంట్‌లో ముఠాల ఏర్పాటుకు దారితీస్తుందని మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సంస్థ ఎల్‌ఐఎఎస్‌ అభిప్రాయపడింది. వ్యవస్థాపక సభ్యుల విమర్శలను పట్టించుకోవడం వల్ల వ్యాపార లక్ష్యాలకు సంబంధించిన ఫోక స్‌ నుంచి సంస్థ యాజమాన్యం దారితప్పే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. సిక్కా నాయకత్వంలోని ఇన్ఫోసిస్‌ మేనేజ్‌మెంట్‌లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపించిందని వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. మరికొందరు వ్యవస్థాపక సభ్యులు కూడా సంస్థ పనితీరును, అగ్ర శ్రేణి ఉద్యోగుల జీతభత్యాల పెంపును విమర్శిస్తూ వచ్చారు.

ఈ గోల భరించలేకనే, గురువారం నాటి బోర్డు సమావేశంలో రవి వెంకటేషన్‌ను కో చైర్మన్‌గా నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు. షేర్ల బైబ్యాక్‌ లేదా డివిడెండ్ల కోసం 13,000 కోట్ల రూపాయలను కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. విమర్శలకు లొంగి ఇన్ఫోసిస్‌ బోర్డు యాజమాన్యంలో మరో కొత్త అంతస్తును సృష్టించిందని, ఇది ముఠాల ఏర్పాటుకే తప్ప ఎందుకూ ఉపయోగపడదని ఎల్‌ఐఎఎస్‌ అభిప్రాయపడింది.దేశీయ కార్పొరేట్‌ రంగంలో కో చైర్మన్‌ అనే పదవే లేదన్న విషయం గుర్తు చేసింది. అంతర్గత వ్యవహారాలపై ఫోకస్‌ తగ్గించి బిజినెస్‌పై ఇన్ఫీ మేనేజ్‌మెంట్‌ ఫోకస్‌ పెంచాలని సలహా ఇచ్చింది.

తగ్గిన సిక్కా వేతనం
ఇన్ఫోసిస్‌ సిఇఒ విశాల్‌ సిక్కా వార్షిక వేతనంలో భారీగా కోతపడింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆయన డ్రా చేసిన వేతనం 66.8 లక్షల డాలర్లు మాత్రమే. ఇది ఆయనకు ఆఫర్‌ చేసిన మొత్తం వేతన ప్యాకేజీలో 61 శాతం మాత్రమే. సిక్కా వేతన ప్యాకేజీ మొత్తం గతంలో బోర్డు సిఫారసు చేసిన ప్రకారం 1.1 కోట్ల డాలర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here