భారత్‌ పై చైనా మరో దుశ్చర్య

0
129

బీజింగ్‌: చైనా మరోసారి​ కవ్వింపు చర్యలకు దిగింది.ఇండియాలోని ప్రాంతాలకు పేర్లు ప్రమాణీకరించి దుస్సాహసానికి ఒడిగట్టింది.అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని ఆరు పట్టణాలకు అధికారికంగా తమ పేర్లు పెట్టి భారత్‌ తో కయ్యానికి కాలు దువ్వింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ను దక్షిణ టిబెట్‌ గా పేర్కొంటూ ఈ దురాగతానికి దిగింది.ఈ మేరకు ఏప్రిల్‌ 14న పౌర వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీచేసినట్టు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. టిబెట్‌ బౌద్ధ మత గురువు దలైలామా.. అరుణాచల్‌ పర్యటనను నిరసిస్తూ భారత దౌత్యవేత్తకు సమన్లు పంపిన 9 రోజుల తర్వాత చైనా ఈ చర్యకు పూనుకుంది.

దక్షిణ టిబెట్‌ లో తన భౌగోళిక సారభౌమత్వాన్ని పునరుద్ఘాటించేందుకే అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని 6 పట్టణాల పేర్లను ప్రమాణీకరించినట్టు చైనా మేధావులు పేర్కొంటున్నారు.చైనా‌, టిబెట్‌, రోమన్‌ అక్షరాలతో ఈ పేర్లు పెట్టింది. వొగ్యలిన్‌ లింగ్‌, మిలా రీ,ఖ్యోడెన్‌గార్బొ,మాణిఖ్వా,బుమొలా,నామ​కాపబ్‌ రీ అనే పేర్లు ఖరారు చేసింది.అయితే ఈ పేర్లు పూర్వకాలం నుంచే ఉన్నాయని.. అప్పట్లో వీటిని ప్రమాణీకరించలేదని,ఇదంతా చైనా కుట్ర అని టిబెట్‌ అకాడమీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ పరిశోధకుడు గుయొ కెఫాన్‌ తెలిపారు.

చైనా-భారత్‌ సరిహద్దులో 3,488 కిలోమీటర్ల మేర వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) ఉంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ను దక్షిణ టిబెట్‌ గా పేర్కొంటూ అది తమదేనని ఎప్పటినుంచో చైనా వాదిస్తోంది. 1962 యుద్ధ సమయంలో కొన్ని ప్రాంతాలకు డ్రాగన్‌ ఆక్రమించింది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరుదేశాల మధ్య 19 సార్లు ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. తాజాగా దలైలామా పర్యటన నేపథ్యంలో చైనా మరోసారి దుశ్చర్యకు దిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here