అమెరికా పై అణ్వాయుధ దాడి చేసే అవకాశం..!

0
142
(FILES) This file photo taken on April 15, 2017 shows an unidentified rocket displayed during a military parade marking the 105th anniversary of the birth of late North Korean leader Kim Il-Sung in Pyongyang. Before tens of thousands of soldiers and civilians marched before him, along with some of the most fearsome weapons at his command, North Korean leader Kim Jong-Un and his audience were shown portraits of his grandfather and father. / AFP PHOTO / Ed JONES / To go with NKOREA-POLITICS-DIPLOMACY-FESTIVAL, FOCUS by Sebastien BergerED JONES/AFP/Getty Images

వాషింగ్టన్: అమెరికాకు పెనుముప్పు పొంచి ఉందనీ, దాని నుంచి అమెరికాను రక్షించుకోవడం కష్టమేనని యూఎస్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్.. ఏ క్షణానైనా అమెరికాపై అణ్వాయుధ దాడి చేసే అవకాశం ఉందనీ, ఒకవేళ అదే జరిగితే అమెరికాను ఎవరూ కాపాడలేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియా వద్ద ఎన్నో అణ్వాస్త్రాలు ఉన్నాయనీ, ఆ దేశంతో సమస్యను త్వరగా పరిష్కరించకపోతే అమెరికాకు చాలా నష్టం కలిగే అవకాశముందన్నారు. యుద్ధానికి సిద్ధం అంటూ కిమ్ ప్రకటనలు చేస్తున్నా అమెరికా ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ఒకవేళ ఉత్తర కొరియా ముందుగా దాడి చేస్తే అమెరికాలోని కొన్ని ప్రధాన నగరాలు నష్టపోక తప్పదన్నారు. జపాన్, దక్షిణ కొరియాతో జతకట్టి కిమ్‌ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నా.. అవి ఫలించడం లేదని వాపోయారు. కాగా ఉత్తర కొరియాతో యుద్ధానికి అమెరికా సిద్ధం అవుతోందంటూ వార్తలు వస్తున్నాయి. దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఉన్న అమెరికా సైన్యం.. తగిన ఏర్పాట్లను చేస్తోందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here