జాతీయ గీతాలాపనకు సంబంధించి మరో కీలక నిర్ణయం?

0
122

న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలు దాదాపు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. ఇప్పుడు తాజాగా జాతీయ గీతాలాపన విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు భావిస్తోంది. ఇక నుంచి సినిమా థియేటర్లలో మాదిరిగానే పార్లమెంట్‌లో, పబ్లిక్ ఆఫీసుల్లో, కోర్టుల్లో కూడా జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాఖలైన ప్రజాహిత వ్యాజ్యానికి సంబంధించి సుప్రీం కోర్టు కేంద్రం స్పందనను కోరింది.

ఈ పిటిషన్‌ను ఢిల్లీకి చెందిన బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేశారు. రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 51ఏ ప్రకారం జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించాలని ఉందని పిటిషనర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ గౌరవం రిపబ్లిక్ డేకు, ఇండిపెండెన్స్ డేకు మాత్రమే పరిమితం కాకూడదని , ప్రతీరోజూ దేశ పౌరులు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే అంగ వైకల్యంతో బాధపడే వారు జాతీయ గీతాలాపన సమయంలో నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here