దంచేసిన విలియమ్సన్‌,ధవన్‌

0
77

భువనేశ్వర్‌ మెరుపుల్లేవు..! రషీద్‌ ఖాన్‌ మాయాజాలం పనిచేయలేదు..! అయినా.. సన్‌రైజర్స్‌ గెలిచింది..! కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది! సీజన్‌లో తొలిసారి బ్యాటింగ్‌లోనూ మెరిసి సొంతగడ్డపై వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ ఐపీఎల్‌లో తొలిసారిగా బరిలోకి దిగిన కేన్‌ విలియమ్సన్‌ క్లాసికల్‌ విధ్వంసానికి.. శిఖర్‌ ధవన్‌ సమయోచిత ఇన్నింగ్స్‌ తోడవడంతో హైదరాబాద్‌ అలవోకగా గెలిచింది. వరుసగా రెండో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో విజయం
డేర్‌డెవిల్స్‌కు మళ్లీ నిరాశ

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతగడ్డపై మరోసారి అదరగొట్టింది. వరుసగా రెండో విజయంతో రెచ్చిపోయింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో బుధవారమిక్కడ జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. వా ర్నర్‌ సేన నిర్దేశించిన 192 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ.. ఓవర్లన్నీ ఆడి ఐదు వికెట్లకు 176 రన్స్‌ మాత్రమే చేసింది. శ్రేయాస్‌ అయ్యర్‌ (31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌ ట్‌), సంజూ శాంసన్‌ (33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42), కరుణ్‌ నాయర్‌ (33) పోరాడినా ఫలితం దక్కలేదు. హైదరాబాద్‌ బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. సి ద్ధార్థ్‌ కౌల్‌, యువరాజ్‌ సింగ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్న ర్‌ (4) త్వరగానే అవుటైనా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేన్‌ విలియమ్సన్‌ (51 బంతుల్లో 6 ఫో ర్లు, 5 సిక్సర్లతో 89), శిఖర్‌ ధవన్‌ (50 బం తుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 70) సూపర్‌ హాఫ్‌ సెంచరీలు సాధించడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 136 ర న్స్‌ జోడించారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్‌ మోరిస్‌ ఒక్కడే నాలుగు వికెట్లు పడగొట్టాడు.

సిరాజ్‌ ఖాతా తెరిచాడు: ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన హైదరాబాద్‌ యువ సంచలనం మహ్మద్‌ సిరాజ్‌ తన తొలి ఓవర్లోనే వికెట్‌ పడగొట్టాడు. మూడు ఫోర్లు కొట్టి జోరుమీదున్న ఢిల్లీ ఓపెనర్‌ బిల్లింగ్స్‌ (13)ను సిరాజ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. రెండో ఓవర్లోనే బిల్లింగ్స్‌ అవుటైనా శాంసన్‌, కరుణ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. భువీ బౌలింగ్‌లో కరుణ్‌ నాయర్‌ రెండు బౌండ్రీలతో జోరు ప్రదర్శించగా.. కౌల్‌ బౌలింగ్‌లో శాంసన్‌ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చాడు. ఆ తర్వాత సిరాజ్‌ బౌ లింగ్‌లోనూ శాంసన్‌ సిక్సర్‌ రాబట్టగా.. నాయర్‌ రెండు బౌండ్రీలు సాధించాడు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడడంతో పవర్‌ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ 56/1తో నిలిచింది. ఆ తర్వాత కూడా ఈ జోడీ జోరు కొనసాగించింది. ఈ జోడీని విడదీసేందుకు వార్నర్‌ పదో ఓవర్లో యువరాజ్‌ను రంగంలోకి దించాడు. ఈ ఓవర్లో కరుణ్‌ రనౌట్‌ కాగా.. ఐదో బంతికి రిషభ్‌ పంత (0) డకౌటయ్యాడు. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌ కుదుపునకు గురైంది.

14వ ఓవర్లో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్‌ ప్రమాదకర శాంసన్‌ను అవుట్‌ చేయడంతో ఢిల్లీ 105/4తో కష్టాల్లో పడిం ది. అప్పటికి ఢిల్లీ విజయానికి 41 బంతుల్లో 87 రన్స్‌ కావాలి. ఈ దశలో మాథ్యూస్‌ (31)తో కలిసి శ్రేయాస్‌ పోరాటం సాగించాడు. రషీద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో శ్రేయాస్‌ రెండు సిక్సర్లతో ఢిల్లీ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. ఆ తర్వాత హెన్రిక్‌ ఓవర్లో 8, భువనేశ్వర్‌ బౌలింగ్‌లో 10, సిద్ధార్థ్‌ బౌలింగ్‌లో 13 పరుగులొచ్చాయి. దీంతో ఢిల్లీకి 12 బంతుల్లో 34 రన్స్‌ కావాల్సివచ్చింది. అయితే 19వ ఓవర్‌ వేసిన భువీ ఫోర్‌తో సహా 10 పరుగులే ఇచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్లో ఢిల్లీకి 24 రన్స్‌ అవసరమయ్యాయి. కౌల్‌ వేసిన తొలి బంతికి అయ్యర్‌ సింగిల్‌ తీయగా.. రెండో బంతిని మాథ్యూస్‌ స్టాండ్స్‌లోకి పంపి హైదరాబాద్‌ శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. కానీ.. యార్కర్‌ సంధించడంతో మూడో బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బాల్‌ కూడా డాట్‌ బాలే పడింది. ఐదో బాల్‌ను భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో లాంగాన్‌లో క్యాచ్‌ ఇచ్చిన మాథ్యూస్‌ నిరాశగా వెనుదిరిగాడు. ఇక ఆఖరి బంతికి సింగిలే వచ్చింది.

కేన్‌, ధవన్‌ మెరుపులు: ఈ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ రెండు మార్పులు చేసింది. మహమ్మద్‌ నబీ, బరీందర్‌ స్రాన్‌ స్థానాల్లో కేన్‌ విలియమ్సన్‌, మహమ్మద్‌ సిరాజ్‌ను తీసుకుంది. అయితే.. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టుకు ఈ మ్యాచ్‌లోనూ శుభారంభం దక్కలే దు. భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ వార్నర్‌ రెండో ఓవర్లోనే నిష్క్రమించాడు. మోరిస్‌ సంధించిన షార్ట్‌ బాల్‌ను త ప్పుగా అంచనా వేసిన డేవిడ్‌.. మిశ్రాకు క్యాచ్‌ ఇచ్చాడు. ఆరంభంలో ఢిల్లీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పవర్‌ప్లేలో 39 పరుగులే వచ్చాయి. అయినా జట్టు ఇంత భారీ స్కోరు చేసిందంటే విలియమ్సన్‌, ధవన్‌ పోరాట ఫలితమే. ముఖ్యంగా ఈ సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన కేన్‌ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. మరో ఎండ్‌ లో ధవన్‌ కూడా మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలో కేన్‌ 33 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. 12.2 ఓవర్లలో జట్టు స్కోరు వంద దాటింది. తర్వాత ధవన్‌ కూడా హాఫ్‌ సెంచరీ (40 బంతుల్లో) మార్కు దాటాడు. దీంతో 16 ఓవర్లకు రైజర్స్‌ 148/1 స్కోరుతో పటిష్ట సిత్థిలో నిలిచింది. అయితే క్రిస్‌ మోరిస్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌వికెట్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు కేన్‌ వెనుదిరిగాడు. రెండో వికెట్‌కు అతను 136 పరుగులు జోడించాడు. అదే ఓవర్లో రెండు బౌండ్రీలతో ధవన్‌ ఊపులోకొచ్చాడు. మాథ్యూస్‌ వేసి న 18వ ఓవర్లో మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌ రాబట్టాడు. అప్పటికి 170/2 స్కోరుతో నిలిచిన హైదరాబాద్‌ 200 మార్కు దాటే లా కనిపించింది. కానీ, 19వ ఓవ ర్‌ తొలి రెండు బంతుల్లో ధవన్‌, యువరాజ్‌ను అవుట్‌ చేసిన మోరిస్‌ 4 పరుగులే ఇచ్చా డు. జహీర్‌ వేసిన ఆఖరి ఓవర్లో దీపక్‌ హుడా (9 నాటౌట్‌) భారీ సిక్సర్‌ కొట్టగా, హెన్రిక్స్‌ (12 నాటౌట్‌) రెండు బౌండ్రీలు బాది ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

స్కోరుబోర్డు
హైదరాబాద్‌: వార్నర్‌ (సి) మిశ్రా (బి) మోరిస్‌ 4, ధవన్‌ (సి) మాథ్యూస్‌ (బి) మోరిస్‌ 70, విలియమ్సన్‌ (సి) శ్రేయాస్‌ (బి) మోరిస్‌ 89, యువరాజ్‌ (బి) మోరిస్‌ 3, హెన్రిక్స్‌ (నాటౌట్‌) 12, హుడా (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 191/4; వికెట్ల పతనం: 1-12, 2-148, 3-170, 4-170; బౌలింగ్‌: జయంత్‌ 2-0-16-0, మోరిస్‌ 4-0-26-4, జహీర్‌ 4-0-37-0, కమిన్స్‌ 4-0-37-0, మాథ్యూస్‌ 3-0-41-0, మిశ్రా 3-0-33-0.

ఢిల్లీ: శాంసన్‌ (సి) హెన్రిక్స్‌ (బి) సిరాజ్‌ 42, బిల్లింగ్స్‌ (సి) హుడా (బి) సిరాజ్‌ 13, కరుణ్‌ (రనౌట్‌) 33, పంత (సి) వార్నర్‌ (బి) యువరాజ్‌ 0, శ్రేయాస్‌ (నాటౌట్‌) 50, మాథ్యూస్‌ (సి-సబ్‌) జోర్డాన్‌ (బి) సిద్ధార్థ్‌ 31, మోరిస్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 176/5; వికెట్లపతనం: 1-14, 2-85, 3-86, 4-105, 5-175; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-29-0, సిరాజ్‌ 4-0-39-2, సిద్ధార్థ్‌ కౌల్‌ 4-0-32-1, రషీద్‌ 4-0-33-0, హెన్రిక్స్‌ 3-0-32-0, యువరాజ్‌ 1-0-6-1.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here