మీ మూడు దేశాలను వదిలే ప్రసక్తే లేదు: కిమ్‌జాంగ్

0
115

ప్యాంగ్యాంగ్: ‘మమ్మల్ని తక్కువగా అంచనా వేయొద్దు. మాతో అసలే పెట్టుకోవద్దు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలతో కలిసి తమ దేశాన్ని నామరూపాల్లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారనీ, అయితే అది సాధ్యం కాదని పేర్కొన్నారు. అమెరికాతోపాటు దక్షిణ కొరియా, జపాన్ దేశాలను బూడిదకుప్పలా మార్చేస్తానన్నారు. అమెరికా కంటే ముందే తాము అణ్వాయుధ దాడితో కోలుకోలేని దెబ్బ తీస్తామని ఉత్తరకొరియా ప్రకటించింది. కాగా సిరియాపై వైమానిక దాడి తర్వాత దూకుడుగా వెళ్తున్న డోనాల్డ్ ట్రంప్.. కిమ్‌జాంగ్ విషయంలో వెనక్కు తగ్గట్లేదని అమెరికా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొదట మాటల్తో మొదలు పెట్టామనీ, చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకుంటే ఎలాంటి పరిణామాలకయినా అమెరికా సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here