సీఎం యోగి మరో సంచలన నిర్ణయం!

0
86

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవిత్ర స్థలాలుగా భావించే అన్ని ప్రదేశాల్లోనూ మద్య నిషేధం అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. నూతన ఎక్సైజ్ విధానాన్ని రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారుల పక్కన మద్యం దుఖాణాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది రోజులకే సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. యూపీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 8,544 మద్యం దుఖాణాలను వేరే స్థలాలకు తరలించారు.

సీఎం మద్య నిషేధం విధించిన ప్రాంతాల్లో హిందూ పుణ్యక్షేత్రాలతో పాటు.. ముస్లిం సహా పలు మతాలకు చెందిన పవిత్ర స్థలాలు కూడా ఉండడం విశేషం. బృందావన్, అయోధ్య, చిత్రకూటం, మిశ్రిక్ నైమిశారణ్యం, పిరాన్ కలియార్, దేవ షరిఫ్, దేవ్‌బంద్ సహా తదితర పుణ్యాక్షేత్రాల్లో ఇకపై మద్య నిషేధం అమలు కానుంది. కాగా ఇప్పటికే అక్రమ కబేళాలను మూసివేయడంతో పాటు ‘యాంటీ రోమియో’ స్క్వాడ్‌‌ల ఏర్పాటు వంటి నిర్ణయాలతో… సీఎం యోగి యూపీ పాలపై తనదైన ముద్రవేయడం తెలిసిందే. కాగా తాజా నిర్ణయంతో పలు మతాలకు చెందిన పెద్దలు యోగిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here