ఆక్సిజన్ లేకపోతే ప్రాణుల్లో జీవం ఉండదని మనకు తెలుసు. కానీ, అసలు ఆక్సిజన్ అవసరమే లేకుండా జీవించే ఒక ప్రాణిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని పేరు ‘హెన్నెగుయా సాల్మినికోలా’. ఇది పరాన్నజీవి. దీనిలోని కణాలు 10 కంటే తక్కువే ఉంటాయి. ‘‘జీవించాలంటే కణాలకు శక్తి కావాలి. దానికి ఆక్సిజనే ఏకైక వనరు. కానీ, అది అవసరమే లేని జంతువును కనుగొన్నాం’’ అని ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డొరొతీ హుచొన్ అన్నారు.