క్రికెట్ స్టార్ తల నుంచి పొగలు..మరీ ఇంత హీటా..?

0
1148

ఇస్లామాబాద్:  క్రికెట్.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించే క్రీడ. బంతి బంతికీ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించే థ్రిల్లింగ్ గేమ్. చూసేవాళ్లకే ఇంత హీట్ పుట్టించే ఆట ఆడేవాళ్లలో ఎంత హీట్ పుట్టించాలి? తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో ఆటగాళ్ల బుర్రలు ఎంతలా వేడెక్కుతాయి? అని చాలాసార్లు మనకు సందేహం కలుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేస్తోంది. ఈ వీడియోలో ఆసీస్ ప్లేయర్ క్రిస్ లిన్.. తల నుంచి పొగలు వస్తున్నాయి. ఇదేమీ గ్రాఫిక్స్ కాదు. నిజంగా నిజం. ఈ వింత దృశ్యం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల కంటబడింది. వర్షం కారణంగా 12ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో క్రిస్ లిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న లాహోర్ కలందర్స్ జట్టు ముందు భారీ లక్ష్యం ఉంది. దాన్ని ఛేదించే క్రమంలో 15 బంతుల్లో 30 పరుగులు చేసిన లిన్.. మరో భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. దీంతో అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో హెల్మెట్ తీసిన లిన్ తల నుంచి పొగలు కక్కుతున్నట్లు కనిపించింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. చావోరేవో అన్నట్లు ఆడే ఆటగాళ్ల టెన్షన్ ఇలానే ఉంటుందంటూ క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here