దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌.. 2 వేలు దాటిన నిర్ధారిత కేసులు..!!

0
1184

సియోల్‌, బీజింగ్‌: కరోనా దేశాలు, ఖండాలను దాటుతోంది. 50 దేశాలను కాల మేఘంలా కమ్మేసింది. న్యూజిలాండ్‌, నైజీరియా, నెదర్లాండ్స్‌ సహా 48 గంటల్లో కొత్తగా 12 పైగా దేశాల్లో కేసులు నిర్ధారణ కావడంతో ఇది ‘మహమ్మారి’గా మారగల వైర్‌సగా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ‘వైరస్‌ కమ్ముకొస్తోంది.. జాగ్రత్త’ అని తీవ్ర స్థాయి హెచ్చరిక జారీ చేసింది. జన్మ స్థానమైన చైనాలో కేసులు, మరణాలు తగ్గుతుండగా దక్షిణ కొరియాలో పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతోంది. శుక్రవారంతో కేసుల సంఖ్య 2,337కు (వీటిలో 571 కొత్తవి), మృతుల సంఖ్య 13కు చేరింది. దీంతో జాతీయ ప్రభుత్వం.. డ్యెగూ నగరంలోని షించియోంజీ చర్చి ఆరాధకులు 3.10 లక్షల మంది వివరాలు సేకరించాలని ఆదేశించింది. కరోనాతో ఇరాన్‌ పార్లమెంట్‌ను మూసివేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here