ఎప్పట్నుంచో వార్తల్లో ఉంటూ వస్తున్న ప్రాజెక్టు `బంగార్రాజు`. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ రూపొందించాలనుకున్న ఈ చిత్రం పలు రకాల కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాకు మార్గం సుగమం అయిందట. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతోందట.
నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగచైతన్య సరసన కథానాయికను త్వరలో ఫిక్స్ చేస్తారట. ప్రస్తుతం నాగార్జున చేస్తున్న `వైల్డ్ డాగ్`, చైతన్య చేస్తున్న `లవ్ స్టోరీ` పూర్తి అవగానే ఈ సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. జూన్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. మరి, ఈ సారైనా వాయిదా పడకుండా అనుకున్న సమయానికి ఈ సినిమా ప్రారంభవుతుందో, లేదో చూడాలి.