ఢిల్లీ మారణహోమాన్ని మర్చిపోయేలా చేయడానికే కరోనా కలకలం : మమతా బెనర్జీ..!!

0
930

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో తృణమూల్ పార్టీ కార్యకర్తలనుద్దేశించి మమతా బెనర్జీ బుధవారం ఒక సభలో ప్రసంగిస్తూ ‘‘ఢిల్లీ హింసాకాండలో నిజంగా ఎంత మంది చనిపోయారో ఎవరికీ తెలియదు, శవాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని పక్కదోవ పట్టిచడానికి మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వం కరోనావైరస్‌ని ఒక భూతంగా ప్రమోట్ చేస్తోంది. బెంగాల్‌లో ఒక వ్యక్తి ఎలుక కరిచి చనిపోయినా సిబిఐ విచారణ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది, అదే ఢిల్లీలో జరిగిన హింసలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు చనిపోయినా సరైన విచారణ జరగడం లేదు. ఈ కేసుని  ఒక మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీలో జరిగిన హింసను అల్లర్లుగా కప్పిపుస్తున్నారు నిజానికి అక్కడ జరిగింది మారణహోమం. ఢిల్లీలో పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉంది. కుప్పలుగా శవాలు బయట పడుతున్నాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. కాలువలో నుంచి శవాలు బయటపడుతున్నాయి. దాదాపు 700 మంది కనపడటం లేదు.  బెంగాల్‌లో బీజేపీ జెండా ఎగురవేస్తామన్న అమితా షా ముందు ఢిల్లీని కాపాడుకుంటే మంచిది, ఆ తర్వాతే బెంగాల్ గురించి ఆలోచించాలి. బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలెవరైనా ‘గొలీమారో సాలోకో’ లాంటి నినాదాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here