క్రూడాయిల్ దెబ్బ: రోజులో ముఖేష్ అంబానీ లక్షల కోట్ల సంపద ఆవిరి, రిలయన్స్‌ను దాటిన TCS..!!

0
1371

కరోనా వైరస్ కారణంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఆయిల్ మార్కెట్ నష్టాల్లో ఉంది. ఈ ప్రభావం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పైనా పడింది. దీంతో మార్చి 9వ తేదీన మార్కెట్ క్యాపిటలైజేషన్ (M-Cap) పరంగా దేశంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) టాప్‌లో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రెండో స్థానంలోకి నెట్టి వేసింది.రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.7,29,998.35 కోట్లు ఇటీవల రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను క్రాస్ చేసిన ఇండియన్ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. అయితే చమురు మార్కెట్ దెబ్బతో రిలయన్స్ M-Cap డిసెంబర్ 2019 రికార్డ్ హైతో పోల్చుకుంటే రూ.2.7 లక్షల కోట్లు ఆవిరైంది. మధ్యాహ్నం గం.2.39 సమయానికి రిలయన్స్ షేర్ రూ.153 తగ్గి రూ.1,118 వద్ద ఉంది. రిలయన్స్ M-Cap రూ.7,29,998.35 కోట్లుగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here