ఢిల్లీ అల్లర్లలో హైదరాబాద్ విద్యార్థుల పాత్ర..ఇంటలిజెన్స్ సంచలన నివేదిక..!!

0
1261

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హైదరాబాద్ విద్యార్థుల పాత్ర ఉందా..? అంటే అవునంటున్నారు కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం అధికారులు. హైదరాబాద్ నగరానికి చెందిన కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేయడం ద్వారా ఢిల్లీలో అల్లర్లకు ఆజ్యం పోశారని తాజాగా కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం అధికారులు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సమర్పించిన రహస్య నివేదికలో వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి చెందిన కొందరు విద్యార్థులు ప్రత్యేక హాష్ ట్యాగ్‌లతో కూడిన మెసేజ్ లను పోస్టు చేశారని ఇంటలిజెన్స్ పేర్కొంది.

వదంతులు, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి వ్యాప్తి చేయడం ద్వారా ఢిల్లీలో అల్లర్లు జరిగాయని గూఢాచారి విభాగం తన నివేదికలో తెలిపింది. అల్లర్ల వ్యాప్తికి హైదరాబాద్ విద్యార్థులను ఉపయోగించారని తేల్చారు. వదంతులు, తప్పుడు మెసేజ్ లను షహీన్‌బాగ్, ఢిల్లీ పోలీసు, మర్డర్స్, జస్టిస్ ఫర్ ఫైజాన్, ఆప్ షరం కరో, అమిత్ షా రిజైన్, అమిత్ షా ఇస్తేఫా దో, ఢిల్లీ అల్లర్లు2020, గోబ్యాక్ అమిత్ షా తదితర హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేశారని ఇంటలిజెన్స్ తన నివేదికలో వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here