తాజా డెత్ వారెంట్లు కోరుతూ కోర్టుకు నిర్భయ ఫ్యామిలీ..!!

0
1267

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషుల ఉరికి తాజా ‘డెత్‌ వారెంట్లు’ జారీ చేయాలని ఆమె తల్లిదండ్రులు మరోసారి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. నిర్భయ కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రెండ్రోజుల క్రితం క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పెట్టుకున్న విజ్ఞాపనను రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఉదయం తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో దోషుల ఉరితీతకు తాజా డెత్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును ఆశ్రయించేంచేందుకు నిర్భయ కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

దీనిపై నిర్భయ ఫ్యామిలీ న్యాయవాది సీమా కుష్వాహ మీడియాతో మాట్లాడుతూ,  దోషుల ఉరితీతకు కొత్త తేదీని ఖరారు చేస్తూ వారెంట్లు జారీ చేయాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేస్తున్నట్టు చెప్పారు. ‘దోషులు అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకున్నారు. అవన్నీ ముగిసిపోయాయి. ఉరితీతకు ఇప్పుడు ఖరారు చేసే తేదీనే చివరి తేదీ అవుతుంది’ అని చెప్పారు.

క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి ముందు ఉందంటూ ఉరితీతపై ఢిల్లీ కోర్టు సోమవారంనాడు స్టే ఇచ్చింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ దోషులను ఉరితీయరాదని స్పష్టం చేసింది. దీంతో దోషుల ఉరితీత అమలు మూడోసారి వాయిదా పడింది. కాగా, పవన్ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తాజాగా తోసిపుచ్చడంతో ఆ మార్గం కూడా మూసుకుపోయంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here