హైవేలపై పోలీసులకు ఏటా ముడుపులు..48 వేల కోట్లు లంచం ఇస్తున్న ట్రక్కు డ్రైవర్లు, యజమానులు.సేవ్‌ లైఫ్‌ అనే ఎన్జీవో సర్వేలో వెల్లడి..!!

0
678

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల కారణంగా దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. గాయాలపాలవుతున్నవారి సంఖ్య అంతకు రెట్టింపు. ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. రోడ్లను బాగు చేస్తున్నాయి. ట్రాఫిక్‌ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేసి అత్యంత కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. అయినప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదు. డ్రైవర్ల అలసత్వం, అధికారుల అవినీతే ఇందుకు కారణం.

ట్రక్కు డ్రైవర్లలో 50 శాతం మందికి పైగా నిద్ర వస్తున్నా డ్రైవింగ్‌ చేస్తున్నారు. 22ు మంది మత్తు పదార్థాలు తీసుకొని ట్రక్కులు నడుపుతున్నారు. సేవ్‌ లైఫ్‌ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేలో ఈ విస్తుగొల్పే విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 12.3ు ప్రమాదాలు ట్రక్కుల వల్లనే సంభవిస్తున్నాయి. 10ు మరణాలకు ట్రక్కులే కారణం. ఈ నేపథ్యంలోనే సేవ్‌ లైఫ్‌ సంస్థ ట్రక్కు డ్రైవర్లపై సర్వే నిర్వహించింది.. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 10 నగరాల్లో 1217 మంది డ్రైవర్లు, 101 మంది యజమానుల నుంచి వివిధ ప్రశ్నల ద్వారా సమాచారాన్ని సేకరించి వివరాలను వెల్లడించింది. డ్రైవర్ల తీరు అలా ఉండగా… రవాణా శాఖ అధికారుల చేతివాటం భారీ స్థాయిలో ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. ట్రక్కు డ్రైవర్లు, యజమానులు ప్రతీ ఏటా హైవేలపై లంచాల రూపంలో రూ. 48 వేల కోట్ల దాకా అధికారులకు ఇస్తున్నట్లు పేర్కొంది. ఇది 2006-07లో రూ. 22 వేల కోట్లుగా ఉంది. 

సర్వే వివరాలు..

లంచం ఇచ్చి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయించుకున్నవారు.. 47 శాతం

సగటున ఒక డ్రైవర్‌ రోజులో ట్రక్కును నడిపే సమయం.. 12గంటలు

డ్రైవింగ్‌ సమయంలో మత్తు పదార్థాలు తీసుకుంటామని చెప్పినవారు.. 22 శాతం

సరైన శిక్షణ లేకుండా డ్రైవింగ్‌  లైసెన్స్‌ పొందామని చెప్పినవారు.. 90 శాతం

తమకు అలసటగా ఉన్నా, నిద్ర వచ్చినా కూడా డ్రైవింగ్‌ చేస్తామని చెప్పారు.. 50 శాతం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here