ముంబై: ముంబై నూతన పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి పరమ్‌వీర్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర అవినీతి వ్యతిరేక విభాగం (ఏసీబీ)కి సారథ్యం వహిస్తున్న ఆయనను.. ముంబై తదుపరి పోలీస్ చీఫ్‌గా నియమిస్తున్నట్టు ఇవాళ ప్రభుత్వం వెల్లడించింది. ఇవాళ పదవీ విరమణ చేయనున్న సంజయ్ బర్వే స్థానంలో పరమ్‌వీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. బర్వే 2019 ఫిబ్రవరి 28న సరిగ్గా ఏడాది క్రితమే ముంబై పోలీస్ కమిషనర్‌గా వచ్చారు. అయితే ఆయన పదవీకాలాన్ని పొడిగించడం లేదనీ.. త్వరలోనే ఆయన స్థానంలో కొత్త పోలీస్ కమిషనర్‌ను నియమిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ శుక్రవారం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పరమ్‌బీర్ సింగ్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది.