డీసీసీబీ, డీసీఎంఎస్‌ జాబితా ఖరారు చేసిన సీఎం పరిశీలకులకు అందించిన కేటీఆర్‌..!!

0
3719

హైదరాబాద్‌: డీసీసీబీ, డీసీఎంఎ్‌సల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల ఎంపికపై టీఆర్‌ఎస్‌ కసరత్తు పూర్తి చేసింది. అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. ఆ జాబితాలను సీల్డ్‌ కవర్లలో పెట్టి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం తెలంగాణభవన్‌లో ఎన్నికల పరిశీలకులకు అందజేశారు. శనివారమే చైర్మన్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా సీల్డ్‌ కవర్లతో 9 జిల్లాల పరిశీలకులూ శుక్రవారం రాత్రే ఆయా జిల్లాలకు చేరిపోయారు. ఎన్నికల సమయంలోనే ఆయా పేర్లను వారు ప్రకటించనున్నారు.

డీసీసీబీ, డీసీఎంఎ్‌సలకు ఎన్నికలు తొమ్మిది ఉమ్మడి జిల్లాల వారీగా జరుగుతున్నా.. అభ్యర్థుల ఎంపికలో మాత్రం కొత్త జిల్లాల వారీగా ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒక ఉమ్మడి జిల్లాలో.. డీసీసీబీ చైర్మన్‌ పదవిని ఒక నూతన జిల్లాకు చెందిన నేతకు ఇస్తే, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవిని మరో జిల్లాకు ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎన్నికల పరిశీలకులతో తెలంగాణ భవన్‌లో సమావేశమైన కేటీఆర్‌.. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులే విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రస్థాయిలో సామాజిక సమీకరణాల ఆధారంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల ఎంపిక జరిగిందని, వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని అన్నారు.

జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ముందుకు పోవాలన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన నాయకులే చైర్మన్లు, వైస్‌ చైర్మన్లుగా ఎన్నికవుతారని, ఇది పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నికైన డైరెక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్టర్లుగా ఎన్నిక కావడం కూడా మంచి గౌరవమని, కొన్ని సమీకరణాల వల్ల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కని డైరెక్టర్లకు పార్టీ పరంగా భవిష్యత్తులో సముచిత స్థానం  కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here